కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్
సింగ్ కు శుక్రవారం నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ పదేళ్ల పాలనలో విప్లవాత్మక నిర్ణయాలతో దేశాన్ని తిరుగులేని శక్తిగా మన్మోహన్ సింగ్ తీర్చిదిద్దారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, మోరపల్లి రమణారెడ్డి, బి. రాఘవరెడ్డి, ఊట్కూరి వెంకట రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.