అదుపు తప్పిన బైకు.. ఇద్దరికీ గాయాలు

4491చూసినవారు
అదుపు తప్పిన బైకు.. ఇద్దరికీ గాయాలు
శంకరపట్నం మండలం కొత్తగట్టుకి చెందిన కత్తెరమల్ల అన్వేష్ తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మొలంగూరు శివారులో రోడ్డు నిర్మాణ సంస్థకు చెందిన టిప్పర్ అతివేగంగా వెళుతూ ఒక్కసారిగా మలుపు తిప్పడంతో బైక్ అదుపుతప్పి కింద పడ్డారు. దీంతో ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పరారయ్యారు. ఇటీవల జరిగిన రెండు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో ఈ సంస్థకు చెందిన వాహనాల వల్లే ప్రమాదాలు జరగడం గమనార్హం.

సంబంధిత పోస్ట్