కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతం 17 రాగానే కొనుగోలు చేసి త్వరితగతిన తరలించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం ఎలిగేడు మండలం నర్సాపూర్ లో ధాన్యం కొనుగోలు కేంద్రం, ఎలిగేడు మార్కెట్ యార్డు, ఇంటింటి సర్వే, దూళికట్టలో కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ బషీర్, అదనపు డిఆర్డిఓ రవికుమార్, ఎంపీడీవో భాస్కరరావు, ఏఓ ఉమాపతి, ఏపీఎం సుధాకర్ పాల్గొన్నారు.