లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చిందని లయన్ సాదుల వెంకటేశ్వర్లు తెలిపారు. కునారం ఎక్స్ రోడ్ లో 64 మందికి ఉచిత డయబేటిక్
పరీక్షలు నిర్వహించారు. పెద్దపల్లి అమర్ చంద్ కల్యాణ మంటపంలో నిర్వహించిన శిబిరంలో రేకుర్తి లయన్స్ హాస్పిటల్ వైద్యలు సేవలు అందించారు. జిల్లా వ్యాప్తంగా 100 మందిలో 38 మందికి ఉచిత శస్త్రచికిత్సలు చేయనున్నట్లు తెలిపారు.