సింగరేణి గని కార్మిక సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి : ఎమ్మెల్యే కోరుకంటి

981చూసినవారు
సింగరేణి గని కార్మిక సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి : ఎమ్మెల్యే కోరుకంటి
మంగళవారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 17వ, 19వ డివిజన్లో ఎమ్మెల్యే చందర్ మంచినీటి శుద్ధి కేంద్రానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, అందుకు అనుగుణంగానే సీఎండీ శ్రీధర్ తో కార్మిక సంక్షేమం కోసం, అందుకు అవసరమైన కార్యచరణను రూపొందిస్తున్నారన్నారు. అందులో భాగంగానే స్థానిక కార్మికుల త్రాగునీటి సమస్యను పరిష్కరించడం కోసం మంచినీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్లకు మరమ్మత్తులు చేయడం జరిగిందని, కార్మిక వాడల్లో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే సింగరేణి అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వేరువేరుగా జరిగిన కార్యక్రమాల్లో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, ఆర్ జి టు జిఎం మనోహర్, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక రావు, కార్పొరేటర్లు తాళ్ల అమృతమ్మ రాజయ్య, సాగంటి శంకర్, బాదే అంజలి నాయకులు అయులి శ్రీనివాస్, మేడి సదానందం మరియు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, తెరాస పట్టణ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్