రామగుండం: మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు

52చూసినవారు
రామగుండం: మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు
సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఆర్జీ3 జీఎం కార్యాలయంలో గురువారం రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలోని వివిధ గనులు, విభాగాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలను నిర్వహించారు. ఎస్ఓటు జీఎం రఘుపతి ప్రారంభించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ఈనెల 23న రాణిరుద్రమ దేవి క్రీడా ప్రాంగణంలో నిర్వహించే సింగరేణి దినోత్సవ వేడుకల్లో బహుమతులు అందజేస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్