బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసులు ఎత్తివేయాలని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తా టిబిజికెఎస్ కార్యాలయ ఆవరణలో కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహరదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు మూల విజయరెడ్డి, గోపు ఐలయ్యయాదవ్ లు పాల్గొన్నారు.