ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై పెద్దపెల్లి జిల్లా కాంటాక్ట్ కార్మికుల సంఘం ఐఎస్టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కార్మిక అమలు అధికారికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పెద్దపెల్లి జిల్లా కాంట్రాక్టు కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి సిలికా శంకర్ మాట్లాడుతూ. రామగుండం ఎరువుల కర్మాగారంలో వివిధ కేటగిరీలలో పని కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారించాలన్నారు.