రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరేం గ్రామానికి చెందిన కొత్త ఆదిరెడ్డి గురువారం బోయినపల్లి నుండి కోరేం వస్తున్న సమయంలో అటుగా వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆది రెడ్డి మృతితో గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.