ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించి ప్రమాదాలను నివారించాలని ఎస్ఐ గణేష్ పిలుపునిచ్చారు. ముస్తాబాద్ లో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలన్నారు.