దక్షిణ కాశీగా పేరుందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ విపరీతంగా ఉన్నది. కార్తీక మాసం పురస్కరించుకొని భక్తులు ముందుగా ధర్మగుండములోని స్నానాలను పూర్తిచేసుకుని కోడె మొక్కులు చెల్లించి స్వామివారి సేవలో తరించారు. భక్తులు భారీగా తరలివచ్చినప్పటికీ ధర్మ దర్శనంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆలయ ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.