రానున్న బతుకమ్మ, దసరా పండగ ఉత్సవాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆధ్వర్యంలో రైతు వేదిక ఆవరణలో వేములవాడ నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.