గత మూడు రోజులుగా మోస్తారుగా కురుస్తున్న వర్షాలకు వేములవాడ మూలవాగు జలకళ సంతరించుకుంది. మూలవాగు పరవళ్ళను చూసేందుకు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. గత మూడు నాలుగు రోజుల నుంచి వాతావరణం మబ్బులతోనే దర్శనమిస్తోంది. భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రజలెవరు నీటి ప్రవాహాల వద్దకు వెళ్లకూడదని కలెక్టర్, ఎస్పి, ఉన్నతాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.