గుండెపోటుకు ప్రధాన కారణంగా ధూమపానం

53చూసినవారు
గుండెపోటుకు ప్రధాన కారణంగా ధూమపానం
ప్రస్తుతం గుండెపోటుకు గురవుతున్న ప్రతి ఐదుగురిలో ఒకరు ధూమపాన ప్రియులే. పొగవల్ల రక్తం చిక్కబడుతుంది. ఫలితంగా, గడ్డకట్టే తత్వం పెరిగిపోతుంది. మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు కఠినంగా మారుతాయి. ఫలితంగా రక్తపోటు అధికం అవుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ తగ్గిపోయి, చెడు కొలెస్ట్రాల్‌ పేరుకుపోతుంది. రోగి పీల్చిన పొగ నేరుగా రక్త నాళాలను దెబ్బతీయడం వల్ల తక్షణమే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. వీరిపై మందులు కూడా సమర్థంగా పనిచేయవు.

సంబంధిత పోస్ట్