AP: కాకినాడ జిల్లా ఎస్.అచ్యుతాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం చేయాలని మందలించిన తల్లిని.. ఆమె కుమారుడు కొట్టి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం.. షేక్ జహీరా కుమారుడు షబీర్ బీటెక్ మధ్యలోనే మానేసి ఖాళీగా ఉంటున్నాడు. దీంతో ఏదైనా ఉద్యోగం చూసుకొమ్మని తల్లి మందలించింది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన షబీర్ తల్లిపై చేయి చేసుకున్నాడు. బలంగా చెంపపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.