ప్రతిరోజు రాత్రి త్వరగా పడుకోవడం, ఉదయం త్వరగా లేవడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని కంట్రోల్ చేసే ధ్యానంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. తాజా పండ్లు, తృణధాన్యాలు, గుడ్లు, నట్స్ వంటివి ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వ్యాయామం, యోగ చేయటం, ఆటలు ఆడటం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది.