త్వరలో ఉబర్ బస్సులు సేవలు

73చూసినవారు
త్వరలో ఉబర్ బస్సులు సేవలు
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ త్వరలో బస్సు సేవలు అందించనుంది. ఢిల్లీలో తొలుత ఢిల్లీ ప్రీమియం బస్ స్కీమ్ కింద బస్సు సేవలను ప్రారంభించనుంది. ఈ మేరకు ఉబర్ తాజాగా ఢిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా లైసెన్స్ అందుకుంది. ఈ తరహా లైసెన్స్ జారీ చేసిన తొలి రవాణా శాఖగా ఢిల్లీ కాగా, దీన్ని అందుకున్న తొలి అగ్రిగేటర్‌గా ఉబర్ నిలిచింది. బస్సు సర్వీసులకు వారం ముందు నుంచే ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చని ఉబర్ తెలిపింది.

సంబంధిత పోస్ట్