TG: హైదరాబాద్ కాచిగూడలో విషాదం చోటుచేసున్నది. సిరిసిల్ల జిల్లా ధర్మారానికి చెందిన రాకేశ్(19) నగరంలో చదువుకుంటున్నాడు. గతంలో రోజుల క్రితం తల్లిదండ్రులకు కాల్ చేసి తనకు చదువు అంటే ఇష్టం లేదని చెప్పాడు. 3రోజులకే రాకేశ్ పేరెంట్స్‌కి రైల్వే పోలీసులు ఫోన్ చేసి కాచిగూడలో అతడు సూసైడ్ చేసుకున్నట్లు తెలిపారు. 'అమ్మానాన్న క్షమించండి. యముడు పిలుస్తున్నాడు. నేను వెళ్తున్నా. బై.. బై' అని ఉన్న సూసైడ్ లేఖను వారు గుర్తించారు.