యూపీలో మరో దారుణం జరిగింది. బరేలీ సిటీ రైల్వే స్టేషన్లో 14 ఏళ్ల బాలికపై రేప్ జరిగింది. ఆమె తన తండ్రి, బంధువులతో ఉత్తరాఖండ్కు తీర్థయాత్రలకు వెళ్లి వస్తోంది. గురువారం రాత్రి ఆ ట్రైన్ రైల్వే స్టేషన్లో ఆగిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఆ బాలికకు ప్రస్తుతం ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది.