స్పైస్ జెట్ విమాన సేవలు రద్దు

69చూసినవారు
స్పైస్ జెట్ విమాన సేవలు రద్దు
హైదరాబాద్ నుంచి అయోధ్యకు గతంలో ప్రారంభించిన విమాన సేవలను రద్దు చేసినట్లు స్పైస్ జెట్ సంస్థ వెల్లడించింది. తగిన డిమాండ్ లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంది. జూన్ 1 నుంచే ఈ సేవలు నిలిపివేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే చెన్నై- అయోధ్య విమాన సేవలను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. కాగా ఏప్రిల్ లో వారానికి మూడు రోజుల చొప్పున HYD నుంచి అయోధ్యకు స్పైస్ జెట్ నాన్ స్టాప్ విమాన సేవలను ప్రారంభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్