రూ. 230 కోట్ల ట్యాక్స్‌ ఎగ్గొట్టిన శ్రీచైతన్య కళాశాల యజమాన్యం

62చూసినవారు
రూ. 230 కోట్ల ట్యాక్స్‌ ఎగ్గొట్టిన శ్రీచైతన్య కళాశాల యజమాన్యం
దేశవ్యాప్తంగా శ్రీచైతన్య కళాశాలల్లో సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణ, AP, దిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలలో ఐదురోజులపాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో రూ. 230 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు గుర్తించారు. ఇంకా విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ. 230 కోట్లతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు తేలింది. విద్యార్థుల నుంచి డబ్బులు వసూలుకు రెండు సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించినట్లు గుర్తించారు. అందులో ఒకటి వసూళ్లకు, మరొకటి టాక్స్ దాచేందుకు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్