శ్రీనివాస శతకం వ్రాసిన సుందరాచారి

80చూసినవారు
శ్రీనివాస శతకం వ్రాసిన సుందరాచారి
మహాత్మాగాంధీ మరణానికి కలత చెందిన శంకరంబాడి సుందరాచారి బలిదానం అనే కావ్యాన్ని వ్రాశాడు. సుందర రామాయణం పేరుతో రామాయణం రచించాడు. అలాగే సుందర భారతం రచించాడు. తిరుమల వెంకటేశ్వరుని పేరుతో శ్రీనివాస శతకం వ్రాశాడు. రవీంద్రుని గీతాంజలిని తెలుగులోకి అనువదించాడు. అలాగే అనేక భావ గీతాలు, స్థల పురాణాలు, జానపద గీతాలు, ఖండకావ్యాలు, గ్రంథాలు రచించాడు. సుందరాచారి గేయ, గీత, బుర్రకథ, నాటక, ఖండకావ్య, కథారచనలే కాక, వేలాది ఉపన్యాసాలు కూడా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్