సోమవారం నుండి శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించనున్న దేవస్థానం అధికారులు. ఇప్పటికే ఆలయ క్యూ లైన్ల ల్లో సామాజిక దూరం పాటించేలా మార్కింగ్ ఇచ్చిన అధికారులు. గతంలో మాదిరి కాకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించనున్నారు.
స్పర్శ దర్శనానికి కొన్ని రోజుల పాటు అనుమతి లేదు, కేవలం భక్తులందరికి అలంకార దర్శనం మాత్రమే.శ్రీశైలం స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు ఆన్లైన్ లో టోకెన్ పొంది ఆధార్ కార్డ్ ,ఏదైనా గుర్తింపు కార్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఆలయ క్యూ లైన్ల లో ధర్మల్ గన్ తో శరీర ఉష్టోగ్రత ను పరిశీలించే , ఫుట్ ఆపరేటింగ్ శానిటేషన్ , స్టాండ్ లను ఎలా ఉపయోగించాలని అనే విషయాలపై దేవస్థానం అధికారులు కోవిడ్ 19 పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, ఆలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు, మాస్క్, తో రావాలి, శానిటేషన్ తో చేతులను శుభ్రం చేసుకోవాలి అని ఆదేశాలు జారీ చేసిన దేవస్థానం అధికారులు.మొదటి రెండు రోజుల పాటు, దేవస్థానం సిబ్బంది, స్థానిక ప్రజానీకానికి స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించనున్నారు.