మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్రం 'ఉద్యోగిని పథకం' తీసుకొచ్చింది. దీని ద్వారా మహిళలు రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చు. వైకల్యం ఉన్నవారు, వితంతువులు, దళిత మహిళలకు వడ్డీ లేని రుణం కల్పిస్తారు. మిగిలిన వర్గాల మహిళలకు 10%-12% వడ్డీ ఉంటుంది. కుటుంబ వార్షిక ఆదాయాన్ని బట్టి 30% వరకూ సబ్సిడీ ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి https://www.myscheme.gov.in/hi/schemes/us ను చూడగలరు.