శ్రీహరికోట నుంచి ఈ నెల 15న ఉదయం 9.17 గంటలకు SSLV-D3 రాకెట్ ద్వారా EOS-08 శాటిలైట్‌ను ఇస్రో నింగిలోకి పంపనుంది. సముద్ర ఉపరితలంపై గాలులు, తేమ, హిమాలయాల్లో క్రియోస్పియర్, వరదలను ఎప్పటికప్పుడు గుర్తించి ఫొటోలను తీసి పంపడం ఈ ప్రయోగ లక్ష్యం. ఈ ఉపగ్రహం బరువు 175.5KGలు. ఇందులో ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్, గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్-రిఫ్లెక్టోమెట్రీ, యూవీడోసిమీటర్ అనే 3 పేలోడ్లను అమర్చారు.