దేశంలోని నిరుద్యోగ సమస్యకు నిదర్శనం ఈ వీడియో అని చెప్పవచ్చు. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా సంస్థ నిర్వహించిన వాకిన్ ఇంటర్వ్యూలో తొక్కిసలాట జరిగింది. ఎయిర్ పోర్ట్ లోడర్ల కోసం ఎయిరిండియా రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టింది. అయితే, 600 పోస్టుల కోసం జరిగిన ఈ వాకిన్‌కు సుమారు 25వేల మంది హాజరయ్యారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపుతప్పింది. వీరిని అదుపు చేసేందుకు ఎయిరిండియా సిబ్బంది సైతం ఇబ్బందిపడ్డారు.