దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం లాభాల్లో మొదలైన సూచీలు అంతర్జాతీయంగా నెలకొన్న ఒడిదొడుకుల నడుమ నష్టాల్లోకి వెళ్లిన సూచీలు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 32.81 పాయింట్లు లాభపడి 78,017.19 వద్ద ముగియగా నిఫ్టీ 10.30 పాయింట్ల లాభంతో 23,668.65 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 16 పైసలు క్షీణించి రూ.85.77గా ఉంది.