ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు మహ్మద్ సిరాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన మీడియాతో సమావేశంలో టీం ఇండియా పునరాగమనం గురించి మాట్లాడారు. 'భారత జట్టుకు ఎంపిక కావడం నా చేతిలో లేదు. నా ఫోకస్ అంతా చక్కగా బౌలింగ్ చేయడం. తన టీం విజయం కోసం వికెట్లు తీయడం పైనే నా దృష్టి ఉంటుంది. నా చేతుల్లో లేని అంశాల గురించి నేను ఆలోచించను' అంటూ వెల్లడించారు.