దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. గత సెషన్‌లో అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల బాటపట్టడంతో దేశీయ మార్కెట్లలో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడ్డారు. నిఫ్టీ 7 పాయింట్ల లాభంతో 25,017 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 13 పాయింట్లు లాభపడి 81,711 వద్ద నిలిచింది. నిఫ్టీ సోమవారం నాడు చేరుకున్న25,000 పాయింట్ల మార్క్‌ను ఈ రోజు కూడా నిలుపుకోవడం గమనార్హం.