దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, వాణిజ్య యుద్ధ భయాలు వెంటాడుతుండడంతో సూచీలు గురువారం కూడా నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 32 పాయింట్లు నష్టపోయి 76,138 దగ్గర ముగియగా నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 23,031 దగ్గర స్థిరపడింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 86.89గా ఉంది.