మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలోని షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడి ప్రభుత్వ హనుమాన్ కళాశాలలో విద్యార్థులు తరగతి గదిలో చేతిలో బీరు బాటిల్స్ పట్టుకుని వాటిని పొంగిస్తూ.. తమ స్నేహితుడి బర్త్ డే వేడుకలు చేశారు. వారితో పాటు బాలికలు కూడా ఉన్నారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.