TG: టీడీపీ పార్టీ తరహాలోనే బీఆర్ఎస్ పార్టీ కూడా 'పింక్ బుక్' మెయింటైన్ చేయడం మొదలు పెట్టిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పింక్ బుక్ లో అన్ని విషయాలు నమోదు చేయడం మొదలు పెట్టమని అన్నారు. ఇంతకింత అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి చెల్లిస్తామని చెప్పారు. లెక్కలు ఎలా రాయాలో మాకు తెలుసు. మీ లెక్కలు తీస్తామని హెచ్చరించారు.