దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 24,304 వద్దకు చేరింది. సెన్సెక్స్ 66 పాయింట్లు ఎగబాకి 80,049 వద్ద ముగిసింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ICICI బ్యాంక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, TCS, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. HDFC, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.