గత నెల 26న ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో నో కామా.. నో ఫుల్ స్టాప్ 24 గంటలు బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈషోకు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ బిగ్‌బాస్ నాన్ స్టాప్ షోలో కంటెస్టెంట్స్ మాత్రమే కాకుండా కొత్తవారు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఓటీటీలోనూ ఈషోను వీక్షించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అది కూడా గంట మాత్రమే కాకుండా 24 గంటలు లైవ్ అనేసరికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఇప్పటివరకు ఈ షో స్ట్రీమింగ్ విషయానికి వస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో ప్రేక్షకులకు నిన్న రాత్రి ఊహించని షాకిచ్చింది సదురు ఓటీటీ. రోజూ లైవ్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో.. బుధవారం అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఈ షో లైవ్ ఆగిపోయింది. తొలిరోజు నాగార్జున వచ్చిన లాంఛింగ్ ఎపిసోడ్ మళ్లీ రిపీట్ చేశారు. ఈ క్రమంలోనే మరింతగా నాన్ స్టాప్ వినోదాన్ని అందించేందుకు ఇంటిని సిద్ధం చేస్తున్నాం.. గురువారం అర్దరాత్రి 12 గంటల నుంచి లైవ్ తిరిగి ప్రారంభమవుతుంది.
ఏరోజుకు ఆరోజు పూర్తి ఎపిసోడ్‌ను రాత్రి 9 గంటలకు విడుదల అవుతుంది. తప్పక చూడండి అంటూ స్క్రోలింగ్ వేసారు. ఇక గురువారం నుంచి లైవ్ విషయంలో మార్పులు జరగనున్నాయి. ఈరోజు జరిగిన ఎపిసోడ్ ను రేపటి రోజున ప్రసారం చేయనున్నారు. అంటే ప్రసారం జరిగిన రోజుకీ.. ఇంట్లో జరిగిన రోజుకు ఒక్కరోజు గ్యాప్ ఉండనుంది. అంతేకాకుండా.. గురువారం రాత్రి నుంచి లైవ్ స్ట్రీమింగ్ ఎపిసోడ్ తోపాటు ఓ గంట నిడివితో ఆ రోజు మొత్తంలో జరిగిన హైలైట్స్ ఎపిసోడ్ వారిగా అప్ లోడ్ చేయబోతున్నారు.