వీధికుక్కను దారుణంగా కొట్టారు (వీడియో)

571చూసినవారు
ఢిల్లీ సామల్కాలో ఇద్దరు యువకులు అమానవీయంగా ప్రవర్తించారు. వీధికుక్కపై సోమవారం విచక్షణా రహితంగా కర్రలతో దాడి చేశారు. యువకుల దాడిలో వీధి కుక్క తీవ్రంగా గాయపడింది. వీరిపై పోలీసులకు జంతు సంరక్షణ కార్యకర్త, న్యాయవాది విశాల్ గౌతమ్ ఫిర్యాదు చేశారు. వీధికుక్కను ఆ యువకులు కర్రలతో కొట్టిన వీడియోను పోలీసులకు అందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీధికుక్కను అకారణంగా కొట్టడంపై విమర్శలొస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్