రక్తహీనతను తేలికగా నయం చేయవచ్చు. ముఖ్యంగా ఐరన్, విటమిన్ బి12 లోపంతో వచ్చేదే ఎక్కువ. ఎందుకంటే మనదగ్గర శాకాహారం ఎక్కువగా తింటాం. మాంసాహారులు కూడా వారంలో ఒకసారో, రెండుసార్లో మాంసం తింటారు. అందువల్ల విటమిన్ బి12 లోపం ఎక్కువ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకోవాలి. ఐరన్ దండిగా ఉండే ఆకుకూరలు, పప్పులు, బెల్లం.. విటమిన్ బి12తో కూడిన మాంసం, పాలు, పెరుగు వంటివి ఎక్కువగా తినాలి.