14 ఏళ్ల వయసులోనే అలాంటి ఘటన ఎదురైంది

1080చూసినవారు
14 ఏళ్ల వయసులోనే అలాంటి ఘటన ఎదురైంది
బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ తనకు చిన్నతనంలో ఎదురైన వేధింపుల ఘటన గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 'నా 14 ఏళ్ల వయస్సులో మా కుటుంబంతో కలిసి బాంద్రాలో ఒక జాతరకు వెళ్లాం. అప్పుడు ఎవరో నా వీపు మీద నొక్కారు. గట్టిగా నన్ను హత్తుకున్నాడు. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. ఈ ఘటన తనపై ఇంకా ప్రభావం చూపుతోంది'అని భూమి తెలిపింది. కాగా భూమి నటించిన భక్షక్ సినిమా ఫిబ్రవరి 9న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్