బిగ్ బాష్ లీగ్‌లో ఊహించని సంఘటన జరిగింది. గురువారం బ్రిస్బేన్ హీట్, హోబర్ట్ హరికేన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో డీజే బూత్‌లో స్వల్ప మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది స్పందించి సమీపంలోని స్టాండ్‌ల నుంచి ఖాళీ చేయమని ఆదేశించారు. స్టాండ్స్‌లో మంటలు చెలరేగడంతో మ్యాచ్‌కు 20 నిమిషాల పాటు అంతరాయం కలిగింది. మంటలు అదుపులోకి రావడంతో ఆట మళ్లీ ప్రారంభమైంది.