వాట్సాప్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ మోడ్ ల ద్వారా నిందితులకు పోలీసులు నోటీసులు పంపించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిఆర్పిసి, 1973/ బిఎన్ఎస్ఎస్ ప్రకారం నిర్దేశించిన సర్వీస్ విధానం ద్వారా మాత్రమే నోటీసులు జారీ చేయడానికి అన్ని రాష్ట్రాలు/యుటీలు పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయాలని ఆదేశించింది. చట్టం ప్రకారం వ్యక్తిగతంగా నోటీసులు అందించాలని న్యాయమూర్తులు MM సుందరేష్, రాజేష్ బిందాల్ ధర్మాసనం పేర్కొంది.