కన్న తల్లిదండ్రుల సంరక్షణ, పోషణ బాధ్యత వారి బిడ్డలదేనని, అలా చేయని వారికి ఆస్తిని పొందే హక్కులేదని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. MPలోని చిత్తార్పుర్కు చెందిన ఓ మహిళ తన కుమారుడికి కొంత ఆస్తిని ఇచ్చింది. కానీ అతడు తల్లిదండ్రులను పట్టించుకోకుండా.. మిగిలిన ఆస్తిని ఇచ్చేయాలని వారిపై దాడి చేశాడు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు కుమారుడికి ఇచ్చిన ఆస్తి హక్కును రద్దు చేసి, ఆ ఆస్తిని తల్లికి అప్పగించాలని ఆదేశించింది.