NEET-UG ఫలితాలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఫలితాలపై వచ్చిన అభ్యంతరాల విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులైన 8కి వాయిదా వేసింది. NEET-2024 ఫలితాల్లో 67 మందికి టాప్ ర్యాంక్ వచ్చింది. వారిలో ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. మరోవైపు ప్రశ్నాపత్రం ముందుగానే లీక్ అయిందని ప్రచారం జరుగుతోంది.