స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

66చూసినవారు
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22లోగా దీనిపై స్పందించాలని ఆదేశించింది. కాగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే జారీ చేసిన నోటీసుల గడువు ముగియడంతో మరోసారి జారీ చేసింది. కాగా ఎల్లుండి ఈ కేసును ధర్మాసనం విచారించనుంది.

సంబంధిత పోస్ట్