వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్న సుప్రీంకోర్టు

52చూసినవారు
వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్న సుప్రీంకోర్టు
పని ప్రదేశాల్లో వైద్యుల భద్రత కోసం విధివిధానాలను రూపొందించేందుకు జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు మంగళవారం వెల్లడించింది. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ వైద్య కళాశాల & ఆస్పత్రిలో జరిగిన 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు నేడు విచారణ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ కేసుపై గురువారం నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్