ఆగస్టు 11న జరగాల్సిన 2024 నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషనర్ల కారణంగా 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడవేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా వివరించింది. "ఈ మధ్య కాలంలో కేవలం పరీక్షను వాయిదా వేయాలనే డిమాండ్ ఎక్కువైంది. ఇది పరిపూర్ణమైన ప్రపంచమేమీ కాదు, మేం విద్యావేత్తలం కూడా కాదు," అని ధర్మాసనం తేల్చి చెప్పింది.