చింతపల్లి: విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన ఘటన కిష్టరాయినిపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వర్ధన్(21) శనివారం రాత్రి గణేష్ మండపం వద్ద విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసేందుకు యత్నిస్తుండగా పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం ఇనుప మెట్లకు విద్యుత్ సరఫర కావడంతో విద్యుత్ షాక్ గురై కింద పడిపోయాడు. చికిత్స కోసం మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.