యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం ఎలక్ట్రిక్ షాపులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అయితే షాపు యజమాని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందజేశాడు. సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.