మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో చిక్సిత పొందుతూ గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు భువనగిరితో ప్రత్యేక అనుబంధం ఉంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏప్రిల్ 26న ఏర్పాటుచేసిన ప్రచార వేదిక సభకు హాజరయ్యారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మన్మోహన్ సింగ్కు స్వాగతం పలికారు. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోతంశెట్టి వెంకటేశ్వర్లును పరిచయం చేశారు.