రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చివ్వెలంలో జరిగింది. ఎస్సై వెంకటరెడ్డి వివరాల ప్రకారం.. మండల కేంద్రంకు చెందిన మిరియాల ప్రతాప్ రెడ్డి పొలం వద్దకు వెళ్తుండగా బైక్ ఢీకొట్టింది. స్థానికులు క్షతగాత్రుడిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనకు సంబంధించి కేసు నమోదు అయింది.