అక్రమ ఇసుక ట్రాక్టర్ల పై కేసు నమోదు

655చూసినవారు
అక్రమ ఇసుక ట్రాక్టర్ల పై కేసు నమోదు
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల పరిధిలోని సోమారం గ్రామ శివారులోని మూసి వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టరును పట్టుకుని కేసు నమెదు చేసినట్టు స్థానిక ఎస్‌ఐ యాదవేంద్ర రెడ్డి మంగళవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా రాత్రి సమయంలో ఎటువంటి అనుమతులు లేకుండా, ఇసుక రవాణా చేస్తున్నారని, నమ్మదగిన సమాచారం మేరకు సోమారం గ్రామం వెళ్లగా గ్రామ శివారులోని మూసీ వాగులో నుండి ఎటువంటి అనుమతులు లేకుండా మూడు ఇసుక ట్రాక్టర్లు ఇసుక లోడుతో వస్తుండగా పట్టుకొని వాటి పై కేసు నమోదు చేసి ట్రాక్టర్ల ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్