దుష్ప్రచారాలు నమ్మవద్దు: ఎమ్మెల్యే

8232చూసినవారు
దుష్ప్రచారాలు నమ్మవద్దు: ఎమ్మెల్యే
కరోనా లక్షణాలు ఉండి ఇంటిలోనే చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా హోమ్ ఐసోలేషన్ కిట్లు అందజేస్తున్నామని హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. ఇళ్లలోనే చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా మందులు, ఇతర సామాగ్రి తో ఉన్న కిట్లను అందజేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపడుతున్నారు అని ఆయన అన్నారు. ఇందుకోసం కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హోమ్ ఐసోలేషన్ చికిత్స పొందుతున్న వారిని టెలి మెడిసిన్ ద్వారా వైద్యులు ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు అని, వారికి తగిన సూచనలు కూడా అంద చేస్తున్నారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న వారెవరూ ఆందోళన చెందవద్దని, సకాలంలో పరీక్షలు నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కరోనా వ్యాధి పట్ల తాము ఎప్పటికప్పుడు సమీక్షలు చేపడుతున్నామని వైద్యులకు, వైద్య సిబ్బందికి తగిన సూచనలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దుష్ప్రచారాలను నమ్మవద్దు అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్